Listen to this article

జనం న్యూస్ జూన్ 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను కాలరాయడం సరైనది కాదని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు రాంబాబు అన్నారు. సీఐటీయు మునగాల మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ రామకృష్ణారెడ్డి కి జూలై 9న జరుగు సమ్మెకు సంబంధించి నోటీసును అందించి మాట్లాడారు.. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి అమలు చేసేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఈ కోడ్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందన్నారు.