

జనం న్యూస్ జూన్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో హన్మకొండ జిల్లా పరిషత్ సీఈఓ విద్యాలత బుధవారం రోజున అకస్మాత్తుగా తనిఖీ చేశారు మండలం లోని గ్రామం లోని పలు రికార్డులను పరిశీలించారు అనంతరం మండలం లోని హుస్సేన్ పల్లి గ్రామంలో ఇంకుడు గుంతలను పరిశీలించారు నర్సరీలను సందర్శించారు అదేవిధంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతులను సిబ్బంది సమయ పాలన రికార్డులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో పణీ చంద్ర ఎంపీఓ రాజు కుమార్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రత్నాకర్ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…..