Listen to this article

జనం న్యూస్ జూన్ 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి

తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోతుల రాజేందర్ నియమితులైన సందర్భంగా గురువారం ఉదయం శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని కుల బాంధవులతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చింతపంటి భూమయ్య, తెల్ల హరికృష్ణ, నాయుడు, శ్రీనివాస్, సత్యనారాయణ, చాట్ల రవి, అల్లం మహేష్, నిర్మల్ శ్రీనివాస్, సతీష్, ప్రవీణ్, కుమార్, శేఖర్, సుప్రీత్, వంశీ, యశ్వంత్ తదితరులు వారితోపాట పాల్గొన్నారు, ఈ సందర్భంగా పోతుల రాజేందర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మున్నూరు కాపు సంఘ అభివృద్ధికి, సంఘ ఐక్యతకు పాటుపడడానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.