

అభినందిస్తున్న ప్రజానీకం.
ప్రతిపక్ష నాయకుల చేసేటువంటి ఆరోపణలు అపోహాలు నమ్మొద్దు…
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి…..
జనం న్యూస్ 24 జనవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాలలో ప్రజా పరిపాలన సభలు విజయవంతం అయ్యాయని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని అని అన్నారు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడవ గ్యారెంటీగా ఇవ్వబోతున్నటువంటి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేనటువంటి నిరుపేదలకు సంవత్సరనికి 12000 రూపాయలు ఇవ్వడం జరుగుతది నూతన రేషన్ కార్డు 3607 ఇందిరమ్మ ఇండ్లు 4943 మంది అర్హత కలిగి ఉండగా రైతు భరోసా కింద సాగు చేస్తున్నటువంటి ప్రతి భూమికి 12000 జనవరి 26న రైతు ఖాతాలో జమ కాబోతున్నాయని లిస్టులో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని జీర్ణించుకోలేక గ్రామాలలో పనికట్టుకొని అమాయక ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని అలాంటి ఆపోహాలను ప్రజలు నమ్మవద్దని జనవరి 26 తర్వాత ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను చూసి ప్రజలే సమాధానం చెప్తారని గత ప్రభుత్వంలో చేసినట్టుగా ప్రజా ప్రభుత్వంలో అధికారపార్టీ యొక్క నాయకుల ప్రమేయం ఉండదని అధికారులే స్వయంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, మాజీ అధ్యక్షులు సుఖినే సంతాజీ, మాజీ సింగల్ విండో చేర్మెన్ గోలి రాజేశ్వర్ రావు, గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్,మండల యూత్ అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ (బక్కి), మాజీ సర్పంచ్ గోడిశాల యాదగిరి, పాక రమేష్, రాజయ్య గౌడ్,రమేష్ బాబు ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శనిగరం వెంకటేష్, స్వరూప,అంబాల స్వామి, మహిళా అధ్యక్షురాలు సుష్మ రెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ యువజన యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శనిగరపు సాహు,జగన్, కడారి సురేందర్, యాదగిరి, రాజు సారయ్య,వినయ్, పొన్నం చందర్, వెంకట్, ప్రదీప్,అనిల్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు