Listen to this article

జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


అమలాపురానికి చెందిన దాత నిమ్మకాయల సత్యనారాయణ సహకారంతో తిరుమల లోని టీటీడీ ఉద్యోగులకు 2000 హెల్మెట్ లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పంపిణీ చేసారు . తిరుమలలోని చైర్మన్ అతిథిగృహంలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగుల భద్రత నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు . అమలాపురంకు చెందిన వ్యాపారవేత్త , దాత నిమ్మకాయల సత్యనారాయణ 15 లక్షల రూపాయిల వ్యయంతో ఈ హెల్మెట్ లను సమకూర్చి టీటీడీకి అందజేసారు . టీటీడీలోని వాహనాలు నడిపే 10 వేల మంది ఉద్యోగులకు వారి భద్రతలో భాగంగా హెల్మెట్ లను ఉచితంగా అందించాలని భావించామని.. ఈ కార్యక్రమానికి పెద్దమనస్సుతో నిమ్మకాయల సత్యనారాయణ సహకరం అందించడం పట్ల చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు . మరిన్ని సేవాకార్యక్రమలతో దాత ముందు ప్రయాణం చేయాలని కోరారు . తిరుమలలో తనకు శ్రీవారి సేవను వివిధ రూపాల్లో చేసుకొనే అదృష్టాన్ని ప్రసాదించిన చైర్మన్ బీఆర్ నాయుడికి , అధికారులకు , పాలక మండలికి , కార్యక్రమానికి సహకరించిన నాగేంద్ర ప్రసాద్ కి దాత సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు .