

జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఆలమూరు పోలిస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎం. అశోక్ మరియు కానిస్టేబుల్ జీవన్ విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఒక ముఖ్యమైన కేసు నిమిత్తం నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వారు ఈ రోజు తెల్లవారు జామున మృతి చెందడం బాధాకరమైనది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము
భారతీయ జనతా పార్టీ, పూర్వ అధ్యక్షులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరు సత్యానందం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకటసుబ్బారావు