Listen to this article

జనం న్యూస్ జూన్ 26(నడిగూడెం)

డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణ కలిగి మంచి సమాజం నిర్మించడంలో ప్రత్యేక భూమిక పోషించాలని తహశీల్దార్ సరిత అన్నారు.గురువారం నడిగూడెంలో యాంటీ డ్రగ్స్ వారోత్సవాలను పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీతో పాటు మానవహారం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఎస్ఐ జి.అజయ్ కుమార్, ఏవో దేవప్రసాద్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.