

జనం న్యూస్ 27జూన్ పెగడపల్లి ప్రతినిధి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోజగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మాదకద్రవ్య నివారణ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని పెగడపల్లి పోలీస్ ఆధ్వర్యంలో పెగడపల్లి మండలం మోడల్ స్కూల్ విద్యార్థులతో కలసి పెగడపల్లి అంబేద్కర్ విగ్రహం నుండి మోడల్ స్కూల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగినది. విద్యార్థులతో కలసి అవగాహన కలిపించే ప్లకార్డ్స్ ప్రదర్శించినారు. ఇట్టి ర్యాలీ లో సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మత్తుపదార్థాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది, విద్యార్థుల జీవితాలను ఇది పూర్తిగా నాశనం చేస్తుంది, మత్తు వ్యసనం నేరాలకు దారితీస్తుంది.యువత మేలుకొని, ఈ దారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంచుకోకూడదని సూచన చేసినారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ఇ కిరణ్ కుమార్, స్థానిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయిలు, పెగడపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.