Listen to this article

మెదక్ జిల్లా టీవీఏసి జేఏసీ అధ్యక్షులు స్వామి

జనం న్యూస్ 2025 జనవరి 24 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్):- విద్యుత్ సంస్థలోఆర్టిసన్స్ ను ప్రభుత్వం లోకి కాన్వర్షన్ చెయ్యాలి లేకపోతే మళ్ళీ ఉద్యమ కార్యాచరణ తప్పదని మెదక్ జిల్లా ఆర్టిసన్స్ అధ్యక్షుడు బి. ఎన్. స్వామి డిమాండ్ చేశారు. ఆర్టిసన్స్ ను ప్రభుత్వ లోకి తీసుకుంటే ఆర్ధిక భారం ప్రభుత్వం పై పడదాని తెలిపారు దీనిని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని ఆర్టిసన్స్ ను ప్రభుత్వం ఆర్టిసన్స్ ను నిర్లక్ష్యంగా చూస్తే ముందు ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని డిమాండ్ చేసారు.ఇప్పటికి ప్రభుత్వం అప్పులల్లో వుందని మాకు తెలుసు ఐనా ఇప్పుడు వున్నా వేతనాలతో ప్రభుత్వం పై అదనపు ఆర్థిక భారం పడదాని తెలియజేసారు. వెంటనే ఆర్టిసన్స్ ను ప్రభుత్వం రెగ్యులరైజ్ చెయ్యాలని మరోసారి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.మెదక్ జిల్లా కేంద్రంలోని ట్రన్స్కో ఎస్ సి కార్యాలయం ముందు గత ఐదు రోజుల నుండి ఆర్థిసన్స్ నిరాహార దీక్షలు నేటితో విరమణ చేశారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు బి. ఎన్. స్వామి విలేఖరులతో మాట్లాడుతూ ఆర్టిసన్స్ ఒక్కే ఒక్క సంస్థ,ఒక్కే ఒక్క రూల్ చెయ్యాలి అని అదేవిధంగా స్టాడింగ్ ఆర్థర్ ను వెంటనే రద్దు చేయాలని అన్నారు ఈ సందర్భంగా ట్రాన్సకో జిల్లా ఎస్ ఈ , డీఈ దీక్ష శిబిరాన్నికి వచ్చి నిరవధిక దీక్ష కు సంఘీభావం తెలిపారు.ఈ సందర్బంగా ట్రాన్సకో ఎస్ ఈ మీడియాతో మాట్లాడుతూ టి వి ఎ సి జె ఎ సి ఆర్టిసన్స్ నిరవధిక సమ్మె శాంతి యుతంగా విధులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సమ్మె చేస్తున్నారని తమ యొక్క భావాన్ని తెలియజేసారు. ఇలా శాంతి యుతంగా దీక్ష చేస్తే తమ డిమాండ్ లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుళ్లి అమలు పరుచేలా డిపార్ట్మెంట్ తరుపున కృషి చేస్తామని చెప్పారు. ఆర్టిసన్స్ సిబ్బందికి ఎలాంటి అండ్డకులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఆర్టిజన్స్ త్వరలోనే విధుల్లోకి రావాలని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షులు నేటితో దీక్షలు ముగిసాయని తెలియజేశారు. ఈ దీక్షలో మహీందర్ రెడ్డి చంద్ర బన్నప్ప అశోక్ సురేష్ నాగరాజు మురళి రాజు రెడ్డి రాజ్ కుమార్ మహేష్ అశోక్ రాజు శ్రీనివాస్ రమేష్ కిషార్ రాకేష్ రామకృష్ణ సోమ శేఖర్ పలువురు పాల్గొన్నారు.