

జనం న్యూస్ 27జూన్ పెగడపల్లి ప్రతినిధి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల పరిధిలో గల పంచాయతీ కార్యదర్శుల కు మండల పరిషత్అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది . ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల, వర్షాకాలంలో వచ్చేసీజనల్ వ్యాధుల గురించి, వన మహోత్సవము, ప్రతిరోజు శానిటేషన్ చేయడం లాంటి పలు అంశాలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో మండల పంచాయతీ అధికారి మహేందర్ మండల వైద్యాధికారి నరేష్ హౌసింగ్ ఏఈ శ్రీకాంత్ ఈసీ రమావతి టి ఏ లు నాని,రాజేశం తదితరులు పాల్గొన్నారు.