Listen to this article

జనం న్యూస్. జనవరి 24. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):-హ త్నూర మండల బోర్పట్ల గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు మాజీ సీనియర్ విలేకరి స్వర్గీయులు శ్రీ కొప్పు నరసింహులు కుమారుడు కొప్పు పవన్ కళ్యాణ్ శుక్రవారం నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సమక్షంలో నర్సాపూర్ లోని వారి నివాసంలో 20 మంది యువ నాయకులతో కలిసి బి ఆర్ఎస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా కప్పు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల బి ఆర్ ఎస్ ఆభ్యర్థుల గెలుపుకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తన తండ్రి పనిచేసిన పార్టీల్లో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు, అలాగే ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు కూడా వెల్కం టూ బిఆర్ఎస్ పార్టీ పవన్ కళ్యాణ్ అంటూ తన తండ్రిని గుర్తు చేస్తూ ప్రేమగా ఆహ్వానించారు,