Listen to this article

జనంన్యూస్ జూన్ 28: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల

మండలం బట్టాపూర్ గ్రామంలోఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆకుల రవి, లబ్ది దారులతో కలిసి శుక్రవారం రోజునా భూమి పూజ నిర్వహించి, ముగ్గు పోయడం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనా ప్రతి ఒక్కరు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు బత్తుల సంజీవ్, మూడ్ రాజు నాయక్,ఫీల్డ్ అసిస్టెంట్ కొండ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులుమరియు తదితరులు పాల్గొన్నారు.