

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 28
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో జూన్ నెల 26/6/25 నుంచి 10/7/25 వరకు తర్లుపాడు మండలంలోని గొర్రెలు మరియు మేకలకి ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా తర్లుపాడు మండలంలోని మంగళకుంట గ్రామంలో గొర్రెలు మరియు మేకల సమూహ ఉచిత నట్టల నివారణ కార్యక్రమంను వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా.డి. విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి మార్కాపురం పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ రమేష్ హాజరై, నిర్వహణను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మొత్తం 3,760 గొర్రెలు మరియు మేకలకు నట్టల మందులు పంపిణీ చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో సన్నజీవాల కాపారులకి డా. రమేష్ మాట్లాడుతూ నట్టల మందు తాపించడం వలన జీవలలో మరణాలు నివరించబడుతాయని గొర్రె పిల్లలు అధిక బరువుతో జన్మిస్తాయి. జీవాలు త్వరతిగతిన బరువు పెరిగి, అధిక రాబడి పొందే అవకాశం ఉంటుంది. జీవాలు ఆరోగ్యంగా, బలంగా , చురుకుగా ఉండి వ్యాధిని తట్టుకొనే శక్తిని పొందుతాయి అని అంతేకాకుండా గోర్రెలు, మేకల్లో వచ్చు సీజనల్ వ్యాధుల గురించి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు , యాజమాన్య పద్ధతుల గురించి సన్నజీవాల కాపారులకి వివరించడం జరిగింది. అలానే ప్రభుత్వం అమలు పరిచిన సన్నజీవాల పశు భీమా పధకం గురించి వివరించారు . ఈ కార్యక్రమంలో విఎ బి. త్రినాథ్ రెడ్డి, ఎహెచ్ ఎ జీ. పుణ్యవతి, పశు సంవర్ధక శాఖ సిబ్బంది మరియు సన్నజీవాల కాపరులు పాల్గొనడం జరిగింది
