Listen to this article

ఘనంగా సన్మానించిన రామకోటి రామరాజు

రామకోటి లిఖిత యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొనలన్నారు

జనం న్యూస్, జూన్ 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

ఈ బిజీ ప్రపంచంలో కూడా సమయాన్ని వృధా చేయకుండా రామ నామమే ప్రాణమని గత కొన్ని సంవత్సరాలనుండి లక్షల సంఖ్యలో రామ నామాలను గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ పిలుపు మేరకు తొగుట మండలం కాంన్గల్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు లక్షల సంఖ్యలో లిఖించిన సంస్థ అధ్యక్షులు రామకోటి పుస్తకాలను రామకోటి రామరాజుకు,అందజేసి భక్తిని చాటుకున్నారు వసుందర. ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు శాలువా కప్పి భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలను అందజే ఘనంగా సన్మానించారు. సమయాన్ని వృధా చేయకుండా రామ నామాలను లిఖించడం అందరికీ సాధ్యం కాదన్నారు. కృషి పట్టుదల, అకుంటిత దీక్ష ఎంతో అవసరం అన్నారు. శాశ్వతమైనది రామ నామం ఒక్కటే అన్నారు.