

జనం న్యూస్ జూన్ 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
నాగార్జునసాగర్ ఎడమ కాలువ పై ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు స్కీములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామంలో మండల స్థాయి పార్టీ సభ్యుల రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సీను ప్రారంభమైనప్పటికీ రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు ఇన్పుట్ సబ్సిడీ అందించడంలో పూర్తిగా పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు సకాలంలో అందజేయాలని డిమాండ్ చేశారు.భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి రెవిన్యూ సదస్సులు జరిపి వచ్చిన దరఖాస్తులు పై నేటికీ చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ శిక్షణా తరగతులకు బుర్రి శ్రీరాములు ప్రిన్సిపాల్గా వ్యవహరించగా,ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నమ్మాది వెంకటేశ్వర్లు,జిల్లా కార్యవర్గ సభ్యులు ములకలపల్లి రాములు,పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే సైదా, జూలకంటి విజయలక్ష్మి, బచ్చల కురి స్వరాజ్యం, మండల కమిటీ సభ్యులు చందా చంద్రయ్య ,స్టాలిన్ రెడ్డి వీరబోయిన వెంకన్న , జూలకంటి కొండారెడ్డి,బట్టు నాగయ్య,వెంకటాద్రి,సిపిఎం సీనియర్ నాయకులు మేదరమట్ల వెంకటేశ్వరరావు, గోగిరెడ్డి వెంకటరెడ్డి,ఆరే రామకృష్ణారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.