Listen to this article

జనం న్యూస్ జూన్ 29 కోటబొమ్మాలి మనడలం : కోటబొమ్మాళిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పూర్వపువైభవం తీసుకువస్తానని రాష్ట్ర వ్యవసాయ, మత్యకార, పాడిపరిశ్రమ, పశుసంవర్ధకశాఖామంత్రి కిజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన శనివారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంఖుస్థాపన, ప్రారంబోత్సవం చేశారు. రూ. 1.8 కోట్లుతో నిర్మించిన ఉప ఖజాన భవనాన్ని, రూ. 1.94.21లక్షలు నిర్మించిన జిల్లా పరిషత్‌ బాలికల అనుబంధ వసతి గృహాన్ని, రూ. 9లక్షలతో నిర్మించి సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. అలాగే తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా రూ. 61 లక్షలతో నిర్మాణం చేపడుతున్న అన్నాక్యాంటీన్‌ భవనానికి, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుర గా 60 లక్షలతో నిర్మించబోతున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిణానికి, పాత పిష్‌ మార్కెట్‌ దగ్గర రూ. 20లక్షలతో నిర్మించనున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిణానికి, పాత పట్నం అమ్మవారి గుడి పక్కనుంచి ఊరమ్మతల్లి ఆలయం వరకు రూ. 30లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పేటకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వెళ్ళిపోవడంతో కోటబొమ్మాళి బోసిపోయిందని, అందుకే డిసిసిబి బ్యాంకు, సబ్‌ రిజిష్టర్‌ కార్యాలయం నిర్మించి, షాపులను నిర్మించి, టెక్కలి నుంచి శ్రీకాకుళం వెళ్ళే బస్సులను కోటబొమ్మాళి మీదుగా వెళ్ళేవిధంగా చేసి కోటబొమ్మాళికి పూర్వపు వైభవం తీసుకువస్తానన్నారు. అలాగే రూ. 80లక్షల వ్యయంతో కొత్త పేట నుంచి కోటబొమ్మాళి పెద్ద చెరువు వరకు రోడ్డుకు మధ్యలో సెంటర్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయటం జరుగుతుందని, కోటబొమ్మాళి మండల కేంద్రంలో గల అన్ని వీధులకు సీసీరోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో కోటబొమ్మాళికి డిగ్రీ కళాశాల మంజూరు చేసినా ప అవసరం లేదని గత వైసీపీ రిపోర్టు ఇవ్వడంతో అది రద్దు అయిందని, మళ్ళి డిగ్రీ కళాశాల మంజూరుకు చర్యలు చేపడుతున్నానని త్వరలో మంజూరు అవుతుందని వ ఎంత్రి తెలిపారు. కోటబొమ్మాళిలో బాలికల పాఠశాలకు నేనే అనుమంతులు తీసుకువచ్చి భవనాలు నిర్మించి ప్రారంభించానని, బాలికల పాఠశాలకు కాంపౌడ్‌ వాల్‌ నిర్మాణా నికి, దానిపైన పించింగు నిధులు మంజూరు చేయటం జరిగిందని అవి త్వరలో నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారితో ఫోన్లో మాట్లాడి బాలికలంతా బాలికల పాఠశాలలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుబంధ వసతి గృహానికి వార్డెన్ను నియమించాలని, బాలికలు వసతి గృహంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ మోహనరావు, సంచాలకులు ఖజాన, లెక్కలు, జిల్లా ట్రెజరి అధికారి సీహెచ్‌. రవికుమార్‌, టెక్కలి ఆర్‌డీవో క్రిష్ణమూర్తి, స్థానిక తహసీల్ధార్‌అప్పలరాజు, ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌, కింజరాపు హరివరప్రసాద్‌, బోయిన గోవిందరాజులు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.