

జనం న్యూస్ 29 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులను హతమార్చి డబ్బు, బంగారాన్ని పట్టుకుపోదామని మాస్టర్ ప్లాన్ వేసి విఫలం చెందిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఈనెల 26న పూల్ బాగ్‌లో నివాసం ఉంటున్న దంపతుల ఇంట్లో చోరీ చేసేందుకు లింగాలవలసకు చెందిన సనాతన్ ప్రయత్నించాడు. కొడవలితో దాడి చేయగా వృద్ధులు కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామని సీఐ శ్రీనివాస్ శనివారం తెలిపారు.