

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కొరకై తన సొంత స్థలని ఇచ్చిన యువకుడు
జనం న్యూస్, జులై 29, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, వేములకుర్తి : గ్రామంలో ఈరోజు పలు అభివృద్ధి పనుల కొరకై వచ్చిన జువ్వడి కృష్ణారావు గ్రామంలో గల సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ఈల్లసారపు కళావతి కనబడగా ఆమె క్షేమ సమాచారం కృష్ణారావు అడిగి తెలుసుకున్నారు, కళావతి మాట్లాడుతూ పార్టీ కోసం 30 సంవత్సరాలుగా పనిచేశానని, గత ప్రభుత్వం తనని కాంగ్రెస్ వాదిగా ముద్ర వేసి ఎలాంటి సంక్షేమ పథకాలు తన వరకు చేరనివ్వలేదని గోడు వెలబోసుకుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాకు అన్ని అర్హతలు ఉన్న ఏలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపింది, వెంటనే జువ్వడి కృష్ణారావు ఇందిరమ్మ కమిటీ వారికి కళావతికి ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ ఇప్పించాలని తెలిపారు, అప్పుడు కమిటీ మెంబర్స్ కళావతికి ఇల్లు నిర్మించడానికి కనీస స్థలం లేదని కృష్ణారావుకి తెలుపగా, అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్త అందుగుల నాగేష్ గొప్ప మనసుతో స్పందించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కొరకు అవసరమైన ఒక గుంట జాగని తన సొంత స్థలం నుండి ఇస్తానని జువ్వాడి కృష్ణారావు ముందు హామీ ఇచ్చారు, పట్టి స్థలంలో కళావతికి ఇల్లు నిర్మించవలసిందిగా జువ్వడి కృష్ణారావును కోరారు, ఒక యువకుడైన అందుగుల నగేష్ తీసుకున్న నిర్ణయానికి కృష్ణారావు అభినందించి శాలువాతో సన్మానించాడు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు గ్రామ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు గూడ శ్రీకాంత్, నేరెళ్ల దేవేందర్, నాయిని సురేష్, ఏళ్లాల వెంకటరెడ్డి, నాంపల్లి వెంకటాద్రి, అంకతి రాజన్న, బుర్రి ముత్తన్న, తరి రామానుజన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు