Listen to this article

జనం న్యూస్ జూన్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం వ్యవసాయ అధికారి గంగా జమున ఫర్టిలైజర్ పెస్టిసైడ్ షాప్ లు తనిఖీలు చేయగా మండలం లోని పత్తిపాక గ్రామంలో మల్లికార్జున ఫర్టిలైజర్ పెస్టిసైడ్ షాప్ యజమాని బంక రాజేంద్ర ప్రసాద్ కాలం చెల్లిన మందులు రూ…9600 విలువ చేసే మందులు విక్రయించడానికి సిద్ధంగా ఉండగా స్వాధీనం చేసుకున్నారు ఎక్స్పైర్ డేట్ అయిపోయిన మందులు అమ్మడం చట్ట విరుద్ధమని చట్టాన్ని ఉల్లంఘించినందుకు షాప్ యజమాని పై శాయంపేట పోలీస్ స్టేషన్ కు పిర్యాదు చేయగా పరకాల రూరల్ సీఐ పి రంజిత్ రావు అక్కడి చేరుకొని మందులను సీజ్ చేశారు షాప్ యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి రంజిత్ తెలిపారు కాగా తనీఖీల్లో ఏఈఓ సుప్రియ కానిస్టేబుల్ సతీష్ పాల్గొన్నారు……