Listen to this article

(✍️జనం న్యూస్ 29 జూన్ మండల ప్రతిదీ కాసిపేట రవి ✍️ )

వైద్యం పేరుతో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటంవాడుతున్నారు.
కొంతమంది ఆర్ఎంపీలకు అనుమతులు లేకుండానే మండల గ్రామాలలో నిర్భయంగా వైద్యం చేస్తున్నా ,వైద్య శాఖ అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారికి కొంతమందికి ఆర్ఎంపీలు ఎక్కడో ఒక మెడికల్ షాప్ లో పనిచేసే ఎలాంటి లైసెన్సులు లేకుండా అధిక డోస్ మెడిసిన్ ఇస్తూ ప్రజల జీవితాల్లో చెలగాటం ఆడుతూ డబ్బులు జేబులు నింపుతున్నారు ప్రధమ చికిత్స చేయాలంటే గుర్తింపు పొందిన డాక్టర్ వద్ద కనీసం 10 సంవత్సరాలుపని చేసినట్లు ఆడాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలి.. కాంపౌండర్ గా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి రోగి స్థితిగతులు ఎంతో కొంతఅర్థమవుతుంది. దానిని బట్టి వైద్యం అందించే అవకాశం ఉన్నదా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పంపించాలా లేదా అనేది ఒక అవగాహనకు రావాలి. అంతేకానీ మెడికల్ షాపుల్లో కొన్ని రోజులు పని చేసి బయటకు వచ్చి ఆర్ఎంపీలుగా చెలమనవుతున్నారు ఎలా?