

1000 ఉద్యోగాలకు 2000 మంది నిరుద్యోగులు హాజరు.
500 మంది నిరుద్యోగులు వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపిక.
అద్భుతం సృష్టించిన మెగా జాబ్ మేళా*
ఆనందం వ్యక్తం చేసిన మెదక్ జిల్లా ప్రజలు. నిరుద్యోగులు
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే. నాలక్ష్యం.
నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి.
జనం న్యూస్. జూన్ 29. మెదక్ జిల్లా. నర్సాపూర్.
నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని సాయి కృష్ణ గార్డెన్ లో ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది.దీంతో పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ జాబ్ మేళా విజయవంతం అయ్యింది. నర్సాపూర్ నియోజకవర్గం నుండే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా నుండి సైతం నిరుద్యోగులు భారీ ఎత్తున జాబ్ మేళాకు తరలివచ్చారు. వెయ్యి మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన జాబ్ మేళాకు రెండువేల మంది నిరుద్యోగులు హాజరయ్యి. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.60.కి పైగా కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొనగా ఇందులో కాగ్నిజెంట్. టెక్ మహీంద్రా. వంటి కంపెనీలతోపాటు వివిధ కంపెనీల ప్రతినిధులు 500 మంది నిరుద్యోగులు వివిధ కంపెనీలలో ఉద్యోగాల కొరకు ఎంపికయ్యారు. ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు పొందిన పలువురికి ఆవుల రాజు రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని అన్నారు. నిరుద్యోగ యువతీ యువత కోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ యూత్ మోటివేటర్ అజయ్ మారుతి రావు ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రాణాలికను సిద్ధం చేశామని ఈ సందర్భంగా తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో మరో వెయ్యి మంది నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలు అందిస్తామన్నారు. ఈ జాబ్ మేళాకు అటు ప్రజల నుండి ఇటు నిరుద్యోగుల నుండి విశేష స్పందన లభించిందని రాబోయే మూడున్నర ఏళ్లలో నర్సాపూర్ నియోజకవర్గంలో నిరుద్యోగులకు 20వేల ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యమని ఆవుల రాజిరెడ్డి వెల్లడించారు. ఈ జాబ్ మేళాకు వచ్చిన నిరుద్యోగులకు వారి తల్లిదండ్రులకు ఉచిత భోజన వసతి కల్పించడంపట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు. ఈ మెగా జాబ్ మేళాలో యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు అన్ని విధాల వసతులతోపాటు సహాయ సహకారాలు అందించారని పలువురు నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో.మండల పార్టీ అధ్యక్షుడు గుర్రాల మల్లేశం. పిఎసిఎస్ డైరెక్టర్ మాచునూరి రాజు యాదవ్. నాయకులు. ఉదయ్ కుమార్. మణిదీప్. గుర్రాల అశోక్. దావుద్. ఇలియాస్ ఖాన్. స్వరూప. నరేందర్ రెడ్డి. నవీన్ గుప్తా. వెంకటరామిరెడ్డి. జ్యోతి సురేష్ నాయక్. కుమ్మరి నాగేష్. సుధీర్ రెడ్డి. హరీష్ వర్ధన్. అజ్మత్. రిజ్వాన్. సాగర్. మల్లేష్ గౌడ్. ఆంజనేయులు. సురేందర్ రెడ్డి. అజీజ్.వివిధ కంపెనీల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువకులు నిరుద్యోగ యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.
