

జనం న్యూస్ జూన్ 29: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలం: ఆలిండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్ కేతావత్ యాదగిరి నాయక్ ఆధ్వర్యంలో జిల్లా పట్టణం నిజామాబాద్ బోర్గం పీ గ్రామంలోని కమ్మకాపు ఫంక్షన్ హల్ లో ఆదివారం నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ మాజీ అధ్యక్షులు అమర్ సింగ్ తిలవత్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రనాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ మోహన్ సింగ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు చంద్రు నాయక్ ఎన్నికలను పర్యవేక్షణ చేసినట్లు వారు తెలిపారు. కాగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా అధ్యక్షులు మూడ్ బాబు రామ్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా కొర్ర గంగాధర్ నాయక్, కోశాధికారిగా దియావత్ శంకర్ నాయక్, ఉపాధ్యక్షులుగా మోహన్ నాయక్, చందర్ నాయక్, కేతావత్ ప్రకాష్ నాయక్, మూడ్ తారాచంద్, మాలవత్ రాములు నాయక్, జిల్లా కార్యదర్శిలు మూడ్ దయానంద్ నాయక్, బాదావత్ బలరాం నాయక్, జరుపల భీమ్లా నాయక్, జాదవ్ గణేష్ నాయక్, జిల్లా సంయుక్త కార్యదర్శి బానోత్ జీవన్, మాలవత్ రమేష్ నాయక్, ధరం సోద్ మోహన్ నాయక్, ఏర్గట్ల మండల అధ్యక్షుడు భూక్య అంజి నాయక్, కారోబార్ మాలవత్ భీమా నాయక్, కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు మాలవత్ ప్రకాష్ నాయక్, అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు జిల్లాలోని తండాల నాయక్, కార్బరిలు, పెద్ద మనుషులు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా అడ్వైజర్ సంగు నాయక్, మాజీ జెడ్పిటిసి శర్మ నాయక్, మాజీ సర్పంచ్ కిషన్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ తుకారం ముని నాయక్, నాయక్ లక్ష్మణ్, శేఖర్ లచ్చిరాం, సోషల్ మీడియా ఇంచార్జ్ కేతావత్ సురేష్ నాయక్,తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.జాతీయ మాజీ అధ్యక్షుడు అమర్‌సింగ్ నూతన కార్యవర్గ కమిటి సభ్యులకు నియామక పత్రాలు అందజేసి వారిని అభినందించారు.