

జనం న్యూస్ జూన్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
భారతదేశంలోని తమిళనాడులో రాష్ట్రంలో ఒకచారిత్రక పట్టణం క్షేత్రం మహాబలిపురం దేవాలయాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు సందర్శించారు. శతాబ్దాల నాటి శిల్పకళ, శిలాశిల్పాలతో కూడిన ఆలయ నిర్మాణాన్ని ఆయన గమనించి అద్భుతంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ భారతీయ నిర్మాణ కళ ఎంత గొప్పదో ఇలాంటి చారిత్రక కట్టడాలు చూస్తే తెలుస్తుంది. భావితరాలకు ఇవి గర్వకారణం. మన సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటం మన బాధ్యత అన్నారు రాజుల కాలంలో ఓడరేవుగా వర్ధిల్లింది ఇక్కడ అనేక రాతితో చెక్కిన స్మారక చిహ్నలు దేవాలయాలు ఉన్నాయి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడ్డాయి మహాబలిపురాన్ని పల్లవరాజు నరసింహ వర్మ న్ స్థాపించాడు అతన్ని మామూళ్ల అని కూడా పిలుస్తారు.ఈ కార్యక్రమం లో తూముకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు కూకట్పల్లి రామాలయం మాజీ చైర్మన్ చిన్న తులసి మాజీ కార్పొరేటర్ బాబురావు
నాగరాజు తదితరులు పాల్గొన్నారు