Listen to this article

జనం న్యూస్- జూన్ 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థులు ఈనెల 29వ తేదీన నల్లగొండ మేకల అభినవ్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అండర్ 14 విభాగంలో పి వెంకట సాయి ఎస్కే నజీబ్ ఆర్ నిఖిలేష్ లు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ పిఈటి జై కిరణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన విద్యార్థులు జేఎన్ వి స్టేడియం హనుమకొండలోజూలై 6,7 తేదీలలోజరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన విద్యార్థులను సెయింట్ జోసెఫ్ హై స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ క్లారా, పి ఇ టి జై కిరణ్ కుమార్ మరియు అధ్యాపక బృందం అభినందించారు.