

జనం న్యూస్ 25 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- విజయనగరం పట్టణంలోని రామకృష్ణ నగర్, ఎల్పీజీ నగర్ కాలనీలలో మంచినీటి కొలాయిలు వేయాలని కోరుతూ జనవరి 28న మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఎం పట్టణ కార్యదర్శి రెడ్డి శంకర్రావు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం విజయనగరంలో గోడ పత్రికను విడుదల చేశారు. గత 15 సంవత్సరాలుగా ఈ రెండు కాలనీల ప్రజలు మంచినీటి కులాయి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే మంచినీటి కుళాయిలు వేయాలని కోరారు.