

జనం న్యూస్ జూలై01,అచ్యుతాపురం:
వైస్సార్సీపీ ఎలమంచిలి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం యలమంచిలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ సమన్వయకర్త యు.వి రమణమూర్తి రాజు (కన్నబాబు) ఆధ్వర్యంలో అచ్యుతాపురం జంక్షన్ పూడిమడక రోడ్డులో ఉన్న లేపాక్షి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దలు మాట్లాడుతూ అధికార కూటమి పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రెడ్ బుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని అన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే క్యూ ఆర్ కోడ్ ను ఆవిష్కరించడమైనదని, ఈ కోడ్ ని స్కాన్ చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలు మరియు మోసాల గురించి పూర్తి సమాచారం తెలుస్తుందని, ఈ క్యూ ఆర్ కోడ్ ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కరణం ధర్మశ్రీ , అనకాపల్లి పార్లమెంట్ పరిశీలికులు శోభా హైమావతి,అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేటి ప్రసాద్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ జడ్పీటీసీలు,ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు,అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండలు పార్టీ అధ్యక్షులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
