

జనం న్యూస్ 25 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- క్షేత్ర స్థాయిలో నేరాలను నియంత్రించుటకు డ్రోన్ వినియోగం క్రియాశీలకంగా మారనున్నదని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 24న తెలిపారు. డ్రోన్ వినియోగించడంలో 30మంది పోలీసు కానిస్టేబుళ్ళుకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – క్షేత్ర స్థాయిలో నేరాల నియంత్రణకు డ్రోన్స్ వినియోగం క్రియాశీలకంగా మారనున్నందున డ్రోన్స్ ఆపరేటర్లుగా పోలీసు కానిస్టేబుళ్ళుకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. త్వరలో ప్రతీ పోలీసు స్టేషనుకు ఒక డ్రోన్ ను ఇవ్వనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసు స్టేషను పరిధిలో డ్రోన్ ను వినియోగించేందుకు, డ్రోన్ ఆపరేటింగు విధానం పట్ల అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ప్రతీ పోలీసు స్టేషను నుండి టెక్నాలజీ వినియోగం పట్ల అవగాహన కలిగిన పోలీసు కానిస్టేబుళ్ళును ఎంపిక చేసి, నిపుణుల పర్యవేక్షణలో వారికి డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ ఇస్తున్నా
మన్నారు. క్షేత్ర స్థాయిలో ఓపెన్ డ్రింకింగు, గంజాయి, పేకాట, కోడి వందాల నియంత్రణకు, క్రౌడ్, ట్రాఫిక్
మేనేజ్మెంట్ చేసేందుకు, వండగలు, ముఖ్య నాయకుల భద్రత, ముఖ్యమైన బందోబస్తుల్లో డ్రోన్స్ ను జిల్లాలో
వినియోగిస్తామన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను అందిపుచ్చుకొని, నేర నియంత్రణలో డ్రోన్స్ వినియోగిస్తామన్నారు. ఒక డ్రోన్ సుమారు 20మంది పోలీసులు చేసే పనిని చేస్తుందన్నారు. ఒక ప్రాంతంలో ఉండి నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలకు లేదా మూడు కిలో మీటర్ల పరిధి వరకు డ్రోన్స్‌ను పంపి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ నిఘా ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. డ్రోన్స్ ఆపరేటింగు విధానంపై అవగాహన కలిగి న నిపుణుల పర్యవేక్షణలో 30మంది పోలీసు కానిస్టేబుళ్ళుకు డ్రోన్స్ వినియోగించి, ఒక ప్రాంతంపై ఎలా నిఘా ఏర్పాటు చేయాలి, వీడియోలు, ఫోటోలు ఏవిధంగా తీయాలన్న విషయాలపై శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్ళు సేవలను పోలీసు స్టేషను పరిధిలో డ్రోన్స్ ఆపరేటర్లుగా వినియోగించి, నేరాల నియంత్రణకు కృషి చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్. గోపాల
నాయుడు, శ్రీనివాసరావు, ఆర్ఎస్ఐ ప్రసాదరావు, డ్రోన్స్ నిపుణులు నరేష్, వెంకటేష్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.