

జనం న్యూస్ జూన్ 30:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలానికి ఈ వానాకాలంకు సంబంధించి తేదీ 30జూన్ 2025 నాటికి 425 .25 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. సోమవారం ఒకే రోజు 1350 బస్తాల యూరియా రావడం జరిగింది. రైతుసోదరులు ఎటువంటి అపోహలకు గురికావద్దు మీకు కావాల్సిన యూరియా మరియు కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కావున రైతులు అవసరానికి తగినంత మాత్రమే తీసుకుపోవాలికానీ పంట మొత్తానికి ఒకేసారి తీసుకపోవడం వలన కృత్రిమ కొరతఏర్పడుతుంది.దీనివలన తోటి రైతులకి సమయానికి అందుబాటులోయూరియా ఉండదుకనుక రైతులు అవసరానికి అనుగుణంగా వాడుకోవాలి. మండలానికి సరిపడా ఎరువుల సరఫరా జరుగుతుంది కావున రైతులుఎట్టి పరిస్థుతుల్లో ఆందళోనకు గురికావద్దు, వదంతులను నమ్మవద్దు అని వ్యవసాయాధికారి వైష్ణవ్ తెలిపారు.