

జనం న్యూస్ జూలై 1 నడిగూడెం
మండలం లోని సిరిపురం క్లస్టర్ రైతు వేదిక నందు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.వ్యవసాయ శాస్త్రవేత్తలు ఖరీఫ్ లో చిరు ధాన్యాల సాగుబడి మెళకువలు,పశుపోషణ-సంరక్షణ
కొబ్బరి తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు.అనుభవజ్ఞులైన రైతులు తమ అనుభవాలను వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ కె.రేణుక,రైతులు పాల్గొన్నారు.