Listen to this article

జనం న్యూస్ 01 జులై


కొత్తగూడెం బస్టాండ్ ఏరియాలో ఒక చిల్డ్రన్స్ పార్క్ ముందు ఈరోజు ఉదయం 11 గంటలకి ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో ఎల్ హెచ్ పి ఎస్ 29వ వార్షికోత్సవ సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు కురుమేల్ల శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎల్ హెచ్ పి ఎస్ ఆవిర్భావం నుండి ఈనాటి వరకు ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో తండాలు గ్రామపంచాయతీలుగా ఆవిర్భవించడమే కాకుండా ఎస్టి జనాభా దామాషా ప్రకారం గా 10% రిజర్వేషన్లు సాధించుకోవడం జరిగిందని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈరోజు మనం అనుభవిస్తున్న ఫలితాలను 18 శతాబ్దంలోనే మహాత్మ జ్యోతిరావు పూలే కలలు గన్నారని వారు చేసిన విద్య ఉద్యమ పోరాట ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ముందడుగు వేస్తున్నారని తెలియజేసినారు టాను నాయక్ గురించి చెబుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి పోరాడిన తాను నాయక్ జీవితం ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో బహుజన ఉద్యమానికి ఊపిరి పోసిన మారోజు వీరన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని గుర్తు చేశారు
ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు మల్లెల రామనాథం ఎస్టి సంఘాల ఐక్యవేదిక నాయకులు వాసం రామకృష్ణ దొర ఎమ్మార్పీఎస్ చాతకొండ నాయకులు కొప్పుల రమేష్ తుమ్మల శ్రీనివాస్ కు రిమెళ్ళ దుర్గయ్య వెంకన్న ఇంకా అనేకమంది బంజారా సోదరులు విద్యార్థులు సైతం పాల్గొని ఆ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకుపోతామని అభివాదం చేశారు