

జనంన్యూస్. 01. నిజామాబాదు.
పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS., వెల్లడి
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు జిల్లా సిపి సాయి చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ క్రీడలు జీవితాన్ని మార్చేస్తాయి ఫుట్బాల్ ఎందుకు ఆడతారు ఫుట్బాల్ అంటే ఏమిటి ఫుట్బాల్ ఒక టీం గేమ్ అంటే ఆషామాషి క్రీడాకాదు ఫుట్బాల్ టెక్నిక్ తో ఆడాల్సిన గేమ్ కాబట్టి ఫుట్బాల్ ను రోజుకు నాలుగు గంటలైనా సాధన చేసినప్పుడే ఫుట్బాల్ క్రీడా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు చదువుతోపాటు క్రీడలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 350 కోట్ల నిధులను క్రీడాభివృద్ధి కొరకు కేటాయించిందని చెప్పారు నిజామాబాద్ జిల్లాలో కోతులు లేకుండా క్రీడాకారులు జాతీయ. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నారని జిల్లాలో అర్జున అవార్డు గ్రహీతలు ఉన్నారని ఆయన అన్నారు. గెలుపొందిన క్రీడాకారులు బాధపడకుండా గెలుపు కొరకు రోజు క్రీడలను సాధన చేయాలని ఆయన చెప్పారు. గెలుపొందిన విజేతలు ప్రథమ.. రంగారెడ్డి ద్వితీయ… నిజామాబాద్ గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షులు కార్యదర్శి కాంగ్రెస్ నాయకులు కుదురు ఫుట్బాల్ కోచ్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
