

జనం న్యూస్. తర్లుపాడు మండలం జులై 2
తర్లుపాడు మండలం లోని తాడివారిపల్లి మరియు మంగళకుంట గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి.జ్యోష్న దేవి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు పొగాకు పంట సాగు విస్తీర్ణం తగ్గించి,ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు.గత సంవత్సరం ప్రభుత్వం వారు పొగాకు సాగు తగ్గించే విధంగా వ్యవసాయశాఖ మరియు టొబాకో బోర్డు వారి సమన్వయం తో రైతులకు అవగాహన కల్పించినప్పటికీ,అధిక విస్తీర్ణంలో సాగుచేసిన రైతులు పంట అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. రైతులందరూ వాణిజ్య పంటలు విస్తీర్ణం తగ్గించి, మెట్ట పంటలు కంది,మినుము,పెసర,మొక్కజొన్న,సజ్జ,జొన్న, నువ్వులు,కొర్ర సాగుచేయాలని తెలిపారు. మెట్ట పంట…
