

జనంన్యూస్. 02.సిరికొండ. ప్రతినిధి.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మోడీ కుట్రలు రైతుల్ని కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మోడీ కుట్రలు చేస్తున్నారని
అఖిలభారత ఐక్య రైతుసంఘ(ఏ.ఐ.యు.కే.ఎస్.) రాష్ట్ర కార్యదర్శిబి. దేవారం అన్నారు.
సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్ ) మండల అధ్యక్షులు ఎం నారగౌడ్ అధ్యక్షాతన మండలాల సయుక్త ప్రథమ మహాసభను జరుపున్నారు. సభకు ముందు సంఘం జెండాను అధ్యక్షులు ఎం. నారగౌడ్ ఎగురావేశారు. అమరవీరులను స్మరిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు: దేశంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల కోటీశ్వరుల అప్పులు రద్దుచేయారు కానీ రైతుల అప్పుల్ని మాత్రం రద్దు చేయలేదు అన్నారు. రామచంద్ర నాటకం దుస్థితి ఏర్పడిందన్నారు. గిట్టుబాటు ధరలు లేక, చేసిన అప్పులు తీరగా రైతాంగం తీవ్రమైన అప్పుల్లో కూరుకు పోయారన్నారు. ఆరుగాలం కష్టపడ్డ చేతికి చిల్లి గవ్వరాక రైతులు ఆందోళన చెందుతున్నారు అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఎం ఎస్ పి చట్టం చేసి రైతాంగానికి పంటల విషయంలో మినిమం గ్యారంటీగా ఉండేటట్లు చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతాంగం చాలా రోజులుగా ఆందోళన చేస్తే వారి డిమాండ్స్ ను అమలు చేస్తామని రాతపూర్వక హామీ ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం పాలరమైన సాక్షిగా అబద్ధాలు చెబుతూ ఆ హామీ తుంగలతో కరన్నారు. రైతు సంఘం ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడితేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రైతులు మూటి కట్టకపోతే రైతులను నిండా ముంచుతారని అన్నారు ఇప్పటికైనా ఐక్యంగా రైతులంతా పోరాటాల సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, జిల్లా నాయకులు కార్యదర్శి ఆర్. రమేష్, అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్ ) జిల్లా అధ్యక్షులు ఎస్. సురేష్, జిల్లా కార్యదర్శి బి. బాబన్న , అఖిలభారత వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపికేఎంఎస్) జిల్లా ప్రధానకార్యదర్శి ఇ. రమేష్ ప్రశాంగించగ అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్ ) జిల్లా నాయకులు ఆర్ దామోదర్, ఎం. లింబన్న,వి.భూమాగౌడ్, బి. బాలకిషన్, జి. కిరణ్, ఎం. మోహన్, ఏ. ఆశిస్, బి.సర్పంచ్ సాయిలు, జి. సాయరెడ్డి, బి. కిశోర్, ఎం. అనిస్, ఎస్. కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
