

జనం న్యూస్ జులై 02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా గిరిజన అభివృద్ది అధికారి కార్యాలయం ఇన్వార్డు లోనీ 2025 జూలై 9,న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె లో జిల్లా వ్యాప్తంగా గిరిజన హాస్టల్ వర్కర్లు పాల్గొంటామని తెలియజేస్తూ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీవేజీ, అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) అద్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సంధర్భంగా సీఐటీయూ జిల్లా కమిటి సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ…నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలనీ, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి. కనీస వేతనం నెలకు రూ.26,000/- లుగా నిర్ణయించాలి. సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పించాలి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించాలి.
రెగ్యులర్ గా వేతనాలు వారి వ్యక్తిగత ఖాతాల్లో వేయాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ప్రతీ నెలా వేతనాలు చెల్లించాలని. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీవేజీ మరియు అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ఉపాధ్యక్షులు అరిగెల కోటయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు తిరుపతి పాల్గొన్నారు.