

జన0 న్యూస్ 03( కొత్తగూడెం నియోజకవర్గం )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటం జరిగింది . ఈ క్యాంపుకు సుజాతనగర్ మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ ప్రసాద్ మరియు కొత్తగూడెం సహకార సంఘం కార్పొరేట్ సొసైటీ సంఘం చైర్మన్ మండే హనుమంతరావు తదితరులు పాల్గొని రోగుల సమస్యలను తెలుసుకొని గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సుజాతనగర్ నాయకుల గూడెం పాస్టర్ వై రాజశేఖర్ బైబిల్ మిషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయటం జరిగింది ఈ క్యాంపు లో మ్యామ్మోగ్రఫీ, ప్యాప్ స్మియర్, ఛాతి ఎక్స్రే షుగర్ టెస్టింగ్ ఎగ్జామినేషన్ మరియు తదితర టెస్టులు రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు అలాగే క్యాన్సర్ కు కారణమైన లక్షణాలను గుర్తించడం జరిగినది ఈ మెడికల్ క్యాంపు కార్యక్రమం లో సుమారు గా 200 మంది పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు