Listen to this article

గొంగటి శ్రీకాంత్ రెడ్డి. మాజీ జెడ్పీటీసీ దొనకొండ

బేస్తవారిపేట ప్రతినిధి, జూలై 03 (జనం న్యూస్):

టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. జగన్ అంటే ఎవరికి నచ్చినా నచ్చకున్నా.. తప్పనిసరిగా జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు. శ్రీకాకుళంలో మారుమూల ప్రాంతాల నుండి అనంతపురం అంచుల దాకా.. కోర్ అమరావతి రీజియన్ నుండి విశాఖ నగరం లాంటి కాస్మోపాలిటన్ సిటీ వరకు.. కటిక బీద వర్గాల నుండి సంపన్నుల వరకు.. వ్యవసాయదారుల నుండి ప్రభుత్వ ఉద్యోగుల వరకు.. గ్రామగ్రామాన, వాడవాడలా జగన్ కు వీరాభిమానులు ఉన్నారు, జగన్ ను రోజూ సాక్షిలో చూసి మురిసిపోయే కామన్ మ్యాన్ ఉన్నాడు.వైసీపీకంటూ ప్రతి ఊరిలోనూ వర్గాలు ఉన్నాయి, కార్యకర్తలు ఉన్నారు, అన్నిచోట్లా 40% ఓటు బ్యాంకు ఉంది. వైయస్ఆర్ లెగసీకి వారసుడిగా, పాత కాంగ్రెస్, యాంటీ టీడీపీ వర్గాలకు ఒక షెల్టర్ గా జగన్ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. సంవత్సరం దాటిన తరువాత కూడా టీడీపీ పాలన గాలికొదిలేసి ఇంకా రోజూ జగన్ ను బదనాం చేసే ప్రయత్నంలో ఉంది. జగన్ ఎంత బలవంతుడో టీడీపీనే రోజూ గుర్తుచేస్తోంది. సీఎంగా జగన్ తప్పులు చేసి ఉండొచ్చు. కానీ మంచి అంతకు మించి చేసాడు. అతను చేసిన అభివృద్ధి మన ఊరిలోని కనబడుతుంది ఒక సచివాలయం రూపంలో, ఒక బడి రూపంలో, ఒక ఆసుపత్రి రూపంలో, పోర్టులు, మెడికల్ కాలేజీల రూపంలో, ఇంకా అనేక సంక్షేమ పథకాల రూపంలో, జీడీపీ అంకెల రూపంలో.. జగన్ ది సస్టైనబుల్ డెవెలప్ మెంట్, బాబుది అబద్దాల డవలప్ మెంట్ ఇందిరాగాంధీ నుండి ఎన్టీఆర్ వరకు ఆందరూ జీవితంలో ఏదో ఓ సమయంలో ఓడిపోయారు. నేర్చుకున్నారు, జగన్ పొలిటికల్ స్టొరీ కూడా వారిని పోలి ఉంది, తప్పుల నుండి నేర్చుకుని ముందుకు వెళ్లే తత్వం ఉంది, ప్రజలను గౌరవించే ప్రజాస్వామ్య విలువల ఉన్నాయి. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడాన్ని ఏ ప్రయత్నం ఆపలేదు.