

బిచ్కుంద జులై 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ యందు మున్సిపల్ కమిషనర్ షేక్ హయూమ్ ప్రతి వార్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు అనంతరం ఆకస్మికంగా బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రి నీ తనిఖీ చేశారు అనంతరం ఫార్మసీ రవి కుమార్ ను అడిగి మందుల స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి అనంతరం రోజు ఓపీలు ఎన్ని వస్తున్నాయని డాక్టర్ రాకేష్ కు అడిగి తెలుసుకున్నారు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైద్య సిబ్బందికి సమయపాలన పాటించాలని ప్రజలతో దురుసుగా మాట్లాడకూడదని సూచించడం జరిగింది అలాగే ఆసుపత్రి ఆవరణ పరిశీలించారు