Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు

చిలకలూరిపేట: గిరిజనుల్లో విప్లవ స్ఫూర్తి రగిలించేటమే కాకుండా వారిలో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగింప చేసి ఉద్యమం వైపు నడిపించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అని నాయకులు కొనియాడారు. అదేవిధంగా భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అని నాయకులు ఉద్ఘాటించారు. రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటిమీద కనుకులేకుండా చేసిన సీతారామరాజు.. తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ ములోని ఎన్నార్టీ సెంటర్ లోని అల్లూరి సీతారామ రాజు విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులునివాళులర్పించారు.పలువురు నాయకులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 1897 జులై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారన్నారని నాయకులు అన్నారు. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి.. సంస్కృతం, జోతిష్యశాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిగా పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు అల్లూరి కబురు పంపారు. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజునుబంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును ఒక చెట్టుకు కట్టివేసి ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపారు. తన తల్లికి రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేశారని పేర్కొన్నారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు. కృష్ణదేవిపేట లో అతని సమాధి ఉందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్, పట్టణ గౌరవ అధ్యక్షులు బి.చిన్న నాయక్, కౌన్సిలర్ వి.కోటా నాయక్, సలికినీడి నాగు బీసీ నాయకులు పుట్టా వెంకట బుల్లోడు, యం. వెంకటేష్ నాయక్, ఆర్ హరి నాయక్, బి శివ నాయక్.డి.వెంకట్, తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.