

జనం న్యూస్ జులై 4 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల బిజెపి నాయకులు శ్రీ చాముండేశ్వరి మాత అమ్మవారినీ దర్శించుకుని మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావ్ గారి పేరు పైన కుంకుమార్చన చేపించి ఇటీవల కాలు శాస్త్ర చికిత్స తీసుకొని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎంపీ త్వరగా కోలుకోవాలని పూజ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల బిజెపి ప్రధాన కార్యదర్శి దొడ్ల నారాయణ రెడ్డి,మండల ఉపాధ్యాకుస్కులు రాజగౌడ్, ముకుంద సంతోష్ కుమార్, మండల మాజీ అధ్యక్షుడు ఎనగండ్ల దశరథ్, బి జె వై ఎం మాజీఅధ్యక్షులు సత్యం, మండల సీనియర్ నాయకులు మన్నే దశరథ్, గారు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు