

విలేకరిపై బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు పై సిపిఎం పార్టీ జరిపిన అత్యా యత్నాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించండి
సూర్య విలేకరి బొబ్బిళ్ళపాటి కిరణ్ పై బీఎస్పీ సీనియర్ నాయకులపై అత్యాయత్నానికి పాల్పడిన సిపిఎం పార్టీ నాయకత్వంపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి
బీఎస్పీ సీనియర్ నాయకులు కొండా చరణ్
జనం న్యూస్ 04జులై ( భద్రాద్రి కొత్తగూడెం)
చర్ల మండల సూర్య రిపోర్టర్ బొబ్బిళ్ళపాటి రవికిరణ్ పై బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు కొండా చరణ్, చెన్న0 మోహన్ లపై, సిపిఎం పార్టీ నాయకులు చేసిన అత్యాయత్నం నీ ఖండించాలని బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు కొండా చరణ్ అన్నారు సిపిఎం పార్టీ నాయకత్వంలో ప్రభుత్వ భూములు ఆక్రమించడం అమాయకులకు అమ్మడం చేస్తున్నారని ఈ విషయాన్ని బట్టబయలు చేసిన బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంపై వార్త రాసిన సూర్య విలేకరి బొబ్బిలపాటి కిరణ్ పై ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బహుజన సమాజ్ పార్టీ ఆఫీసుకి సిపిఎం పార్టీ నాయకత్వం వందల మందిని తీసుకొని వచ్చి చంపే ప్రయత్నం చేశారని ఇది అత్యంత దారుణమైన చర్యని అన్నారు ప్రశ్నిస్తే చంపడమేనా సిపిఎం పార్టీ నీతి సిద్ధాంతం అని ప్రశ్నించారు తప్పు మీరు చేసి నిజాలు రాసిన విలేకరులని, ప్రశ్నించిన ఇతర పార్టీ నాయకులను చంపేస్తారా అంటూ నిలదీశారు గుడుల భూములు కబ్జా చేయటం గుట్ట భూములు కబ్జా చేయటం మండలంలోని ప్రభుత్వ భూములు కబ్జా చేసుకొని మీ నాయకులు సొమ్ము చేసుకోవటమేనా మీ పార్టీ మీకు నేర్పిస్తున్న సిద్ధాంతం అని మండిపడ్డారు మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడమేనా మీ విప్లవ రాజకీయాలంటే అని ప్రశ్నించారు పేదలకు దక్కవలసినటువంటి ప్రభుత్వ భూమిని సిపిఎం పార్టీ నాయకులు మరియు పట్టాలు లేని వాళ్ళు కూడా పంచుకోటమేనా మీరు ప్రజలకు చేసే న్యాయం అని అన్నారు అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి ఉసుగొల్పి మర్డర్ కేసుల్లో ఇరికించటమేనా మీ పని అని అన్నారు బీఎస్పీ సిపిఐ పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని నాడు సిపిఎం వాళ్ళు పత్రిక ప్రకటనలు ఇచ్చారు నేడు అదే భూమిలో సిపిఐ బీఎస్పీ పార్టీ చెప్పింది నిజమని రెవిన్యూ వాళ్లు ఆ భూమిలో హెచ్చరిక బోర్డులు పెట్టారు ఇప్పుడు సిపిఐ బిఎస్పీ చెప్పింది నిజమా లేక సిపిఎం పార్టీ నాయకులైన మీరు చెప్పింది నిజమా అని ప్రశ్నించారు కల్లబొల్లి కబుర్లు చెబుతూ అమాయక ప్రజల్ని మోసం చేయొచ్చు గాని చట్టాన్ని మోసం చేయలేరని అన్నారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామని అచ్చ చేయడానికి పార్టీ ఆఫీసులోకి చొరబడి ప్రయత్నించిన ప్రతి ఒక్కరిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పోలీసు వారిని విన్నవించారు లేనియెడల న్యాయ పోరాటానికి రాజ్యాంగబద్ధంగా ఎంత దూరమైనా వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు గోగీకార్ లక్ష్మణ్ , పార్టీ సీనియర్ నాయకులు సామల ప్రవీణ్ పార్టీ సీనియర్ నాయకులు చేన్న0 మోహన్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రాల విజయ్ కుమార్ పార్టీ సీనియర్ నాయకులు పర్షిక త్రిమూర్తులు పార్టీ సీనియర్ నాయకులు కొండా కౌశిక్ పార్టీ సీనియర్ నాయకులు సందీప్ తదితరులు పాల్గొన్నారు