Listen to this article

*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా // ముమ్మిడివరం //

జనం న్యూస్ జనవరి 25 కాట్రేనికోన:- ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సన్నాహక సమావేశం 25వ తేదీ ఉదయం ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చి బాబు వారి పార్టీ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో పార్టీ తరపున నియమించిన పరిశీలకులు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు మరియు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం లు గుత్తి సాయి పాల్గొని కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్ధతుగా కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేయాలని కోరారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.