Listen to this article

జనం న్యూస్. జూలై 4. సంగారెడ్డి జిల్లా. హత్నూర.

హత్నూర మండల పరిధిలోని షేర్ ఖాన్ పల్లి గ్రామశివారులోగల శ్రీపలుగు మీది నల్ల పోచమ్మ తల్లి దేవస్థానము వద్ద శనివారం నాడు బహిరంగంగా వేలం పాట ఉన్నట్లు దేవాదాయశాఖ కార్యనిర్వహణ అధికారి దేవానందం,ఒక ప్రకటనలో తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ వేలం పాట మధ్యాహ్నం 12 గంటలకు దేవస్థాన ప్రాంగణంలో బహిరంగంగా వేలంపాట నిర్వహించడం జరుగుతుందని అన్నారు, ఈ వేలంపాటలో కొబ్బరికాయలు,పూజ సామాగ్రి అమ్మకాలు , అమ్మవారికి సమర్పించిన చీరలు సేకరణకు, కొబ్బరి మొక్కలు, ఒడి బియ్యం, కుడుకలు, ఖర్జూరాలు, వక్కులు, లడ్డు ప్రసాదము, పులిహోర విక్రయించుటకు, ముక్కు బడి మేకల హక్కు పొందడానికి వేలంపాట ఉంటుందని అన్నారు, వేలం పాటలో పాల్గొనేవారు ముందు దేవస్థానం కార్యాలయానికి వచ్చి సమాచారం ఇచ్చి పేరు నమోదు చేసుకోవాలని కోరారు, వేలం దక్కించుకున్న వారికి కాలపరిమితి ఒక్క సంవత్సరం వరకు హక్కును కలిగి ఉంటారని తెలిపారు,