Listen to this article

ఎమ్మెల్యే విజయ్ కుమార్

జనం న్యూస్,జూలై 05, అచ్యుతాపురం:


అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం కొండపాలెం గ్రామానికి చెందిన చోడిపల్లి ఎర్రయ్య చేపలు వేటకు వెళ్లి చేపను బయటకు తీసే సమయంలో యర్రయ్య సముద్రంలో గల్లంతు అయ్యారు.రోజులు గడుస్తున్నా నేటి వరకు యర్రయ్య ఆచూకీ లభ్యం కాలేదు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, కూటమి నాయకులతో కలిసి సముద్రంలో గల్లంతైన చోడిపల్లి ఎర్రయ్య కుటుంబాన్ని శనివారం పరామర్శించి, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రంలో ఒడిస్సా వైపు కోస్ట్ గార్డ్ ద్వారా గల్లంతైనా వ్యక్తి కోసం హెలికాప్టర్ మరియు కోస్ట్ గార్డ్ స్టీమర్లు ద్వారా వెతకడం జరుగుతుందని, గల్లంతైన మత్స్యకారుడి కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ,బిజెపి నాయకులు పాల్గొన్నారు.