

జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి
మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య జయంతిని శు క్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రోశయ్య చిత్రపటానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం, నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కంకటాల నవీన్, వరదా శ్రీరామచంద్రమూర్తి, కంకటాల సురేష్, సూర్యనారాయణ మూర్తి, రాంబాబు, వరదా కనక రమేష్,నాని, బుల్లోడు,గోకవరపు వీరేష్, గాది రామం తదితరులు పాల్గొన్నారు.
