

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 5 రిపోర్టర్ సలికినీడి నాగు
గ్రామాలకు చెందిన ఎన్నారైలతో స్థానిక నాయకులు సమన్వయం చేసుకొని, పీ-4ను విజయవంతం చేయాలి :ప్రత్తిపాటి.
9,800 బంగారుకుటుంబాల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా అధికారులు, నాయకులు పనిచేయాలి : ప్రత్తిపాటి
పేదరికం లేని సమాజమే లక్ష్యంగా.. పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కూటమిప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తోందని, పీ-4 లో భాగంగా తొలిదశలో 15లక్షల కుటుంబాల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఆయన బంగారు కుటుంబాల ఎంపిక, మార్గదర్శుల పాత్ర : ప్రభుత్వ విధివిధానాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పేద కుటుంబాల్ని ఆదుకునే మార్గదర్శుల ఎంపికపై దృష్టి పెట్టండి పీ-4లో భాగంగా ప్రభుత్వం ఇప్ప్పటికే నియోజకవర్గంలో 9,800 కుటుంబాలను గుర్తించిందని, ఆ కుటుంబాలకు అండగా నిలిచే మార్గదర్శుల ఎంపికపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రత్తిపాటి సూచించారు. కనీస అవసరాలైన విద్యుత్.. గ్యాస్వం టివికూడా లేని కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని, వాటికి మెరుగైన సౌకర్యాలు అందించిడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. పేద కుటుంబాల్లో చదువుకునే పిల్లలుంటే వారికి ఆర్థిక సాయం నిరుద్యోగులుంటే ఉద్యోగ కల్పన, వ్యాధిగ్రస్తులుంటే వారికి నాణ్యమైన వైద్యం అందించడం, సదరు కుటుంబాల ఆదాయ పెంపునకు చేయూత ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ప్రత్తిపాటి పేర్కొన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా వికసిత్ చిలకలూరిపేట సాధన దిశగా అధికారులు సరైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రత్తిపాటి ఆదేశించారు. స్థానిక నాయకత్వం ఎన్నారైలు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. పేద కుటుంబాల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఆగస్ట్ 15 నాటికి 15 లక్షల పేద కుటుంబాల్ని పీ-4 పరిధిలో చేర్చి, వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న దిశగా కూటమిప్రభుత్వం అడుగులేస్తోందని ప్రత్తిపాటి చెప్పారు. ఇప్పటికే గ్రామాలకు చెందిన పలువురు ఎన్నారైలు తమ ఉదారత చాటుకుంటున్నారని, గ్రామ.. మండల నాయకులు వారితో మాట్లాడి, పేద కుటుంబాల్ని అక్కున చేర్చుకునేలా చూడాలన్నారు. అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ, కూటమిపార్టీల శ్రేణులు నియోజకవర్గంలోని 10వేల కుటుంబాల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో మూడు మండలాల ఎంపీడీవో లు, ఎమ్మార్వో లు, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, కందుల రమణ, వివిధ హోదాలలో నాయకులు, అదికారులు తదితరులున్నారు.