Listen to this article

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ చిన్న చెరువు లో మోటర్లు వేసి తన సొంత భూమికి నీటిని సరాపరా చేస్తున్నరని ఆయకట్ట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయకట్ట రైతులు మాట్లాడుతూ చెరువులో ఆయకట్టుకు సరిపోయే నీరు లేకపోవడంతో నీటిని నిల్వ ఉంచడం జరిగిందని అన్నారు. నిలువ ఉంచిన నీటిని చెరువు పైన ఉన్న రైతు ప్రేమ్ సింగ్,తండ్రి మంగల్దీప్,చెరువులో మోటర్ వేసి నీళ్లు కాజేయడం జరుగుతుందని చెరువు కింది ఆయకట్ట రైతులు మండి పడుతున్నారు. నీటిపారుదల శాఖ,రెవిన్యూ శాఖ, అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీళ్లు అన్యాక్రాంతం కాకుండా చూడాలని రైతన్నలు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రజాపాలన గ్రామసభలో మండల ప్రత్యేక అధికారి ఏడిఏ నూతన్ కుమార్,దృష్టికి తీసుకురావడంతో, వెనువెంటనే నీటిపారుదల శాఖ డిఈ విజయభాస్కర్ ను చరవాణిలో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు.డిఈ స్పందించి సమస్య స్థలానికి ఏఈఈ రాజును,పంపించారు. సమస్య స్థలానికి చేరుకున్న ఏఈఈ ను పాత్రికేయులు వివరణ కోరగా చిన్న చెరువు నీళ్లు అన్యాక్రాంతం అవుతున్నది వాస్తవమేనని అన్నారు. చెరువులో వేసిన మోటర్ ను రెండు రోజుల్లో తీసివేయాలని ప్రేమ్ సింగ్ ను ఆదేశించామన్నారు. రెండు రోజుల్లో చెరువులోని మోటార్ను తొలగించని పక్షంలో చట్టరీత్య చర్యలు తీసుకుంటామని అన్నారు.