

జనం న్యూస్ జూలై 06:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోనున్న పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సై గా ఆదివారం రోజునా పడాల రాజేశ్వర్ భాద్యతలు స్వీకరించారు. గతంలో ఎస్సై గా ఉన్న బి. రాము బదిలీ భాగంగా వి ఆర్ పై నిజామాబాద్ వెళ్లడం తో ఆయన స్థానంలో నూతన ఎస్సై గా రావడం జరిగింది.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ చట్టాలను అతిక్రమిస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని అదేవిధంగా అన్ని గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం కలగాలంటే గ్రామ ప్రజలు మాతో సహకరించాలని కోరారు.