Listen to this article

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా

ప్రేమ జంట అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన రామచంద్ర పురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్సిపురం పోలీసులు వివరాల ప్రకారం రామచంద్రపురం మండలం బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని బండ్లగూడ గ్రామానికి చెందిన రమ్య ,ఆకుల ప్రవీణ్ గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. విషయం తెలిసిన రమ్య కుటుంబ సభ్యులు రెండు నెలల క్రితం పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.ఇలా ఉండగా నిందితుడు సోమవారం ఉదయం ఆకుల ప్రవీణ్ రమ్య నివాసంలో ఎవ్వరు లేని సమయంలో గొంతు కోయడంతో రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆకుల ప్రవీణ్ కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన స్థానికులు 108 సహాయంతో ఊపిరితో ఉన్న ఆకుల ప్రవీణ్ ను బీరంగూడ లోని పెనేషియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
మృతురాలు రమ్య డిగ్రీ పూర్తి చేసి ఎనిమిది సంవత్సరాలుగా బండ్లగూడలోని బాలజీ నగర్ లో నివాసం ఉంటున్నారనీ సమాచారం.రమ్య మెడపై కత్తితో దాడి చేసి అనంతరం ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఇద్దరు ఆత్మా హత్యకు పాల్పడ్డారా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని రామచంద్రాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు తెలియాల్సింది.