

జనం న్యూస్ జూలై వీడు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోనలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సిద్ధి వినాయక స్వామి వారికి తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని సహస్రనారీకెల జలాభిషేకం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ ఫణికాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఈ సామూహిక పూజా కార్యక్రమంలో తొలుత విగ్నేశ్వర పూజ, లఘున్యాస o, పంచామృత అభిషేకం తోపాటు సహస్రనారికేల జలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.అధిక సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఆనివిళ్ల సాయిబా బా, ప్రముఖ వేద పండితులు ఆ కొండి శంకర శాస్త్రిరామకృష్ణ పరమహంస, గ్రంధి రాంప్రసాద్, ఆ కొండి శేషు, ఆణి విళ్ళ పవన్ కుమార్,బాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
