

జనం న్యూస్ 08 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
బాధిత మహిళలకు సఖి వన్ స్ట్రాప్ సెంటర్ ద్వారా అవసరమైన అన్ని రకాల సేవలను అందించడం జరుగుతోందని కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. సఖీ వాల్ పోస్టర్ను తమ ఛాంబర్లో కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. దాడికి గురైన మహిళలు, బాలికలకు న్యాయ, వైద్య, పోలీసు సహాయంతో పాటు కౌన్సిలింగ్ నిర్వహించడమే కాకుండా వారి రక్షణ కోసం తాత్కాలిక వసతిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.